కవితకు బెయిల్.. కాంగ్రెస్ సీరియ‌స్ కామెంట్స్‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఊహించిందేన‌ని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు

By Medi Samrat  Published on  27 Aug 2024 3:06 PM IST
కవితకు బెయిల్.. కాంగ్రెస్ సీరియ‌స్ కామెంట్స్‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఊహించిందేన‌ని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వ‌చ్చింద‌ని ఆరోపించారు. మొన్నటి వరకూ చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశార‌ని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యింద‌ని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయ్యిందన్నారు.

హరీష్‌, కేటీఆర్‌లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని.. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. బీజేపీ, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందని.. ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందన్నారు.

బీఆర్ఎస్ బీజేపీ బంధం బయటపడిందని మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కవితకి బెయిల్ వస్తుందని వారం క్రితమే రేవంత్ చెప్పారు.. బెయిల్ వచ్చింది.. బీజేపీ బీఆర్ఎస్ విలీనం మిగిలి ఉందన్నారు. పక్క రాష్ట్రంలో చేసిన అవినీతికి కవిత శిక్ష అనుభవించిందని.. తెలంగాణలో చేసిన అవినీతికి కూడా కల్వకుంట్ల కుటుంబం శిక్ష అనుభవించక తప్పదన్నారు.

Next Story