కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాహుల్‌ లా పాద‌యాత్ర చేయాలి

Congress Leader VH Fire On Prashant Kishore. గతంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సర్వేలు ఉండేవ‌ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు

By Medi Samrat  Published on  11 Oct 2022 5:52 PM IST
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాహుల్‌ లా పాద‌యాత్ర చేయాలి

గతంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సర్వేలు ఉండేవ‌ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. సర్వే లు చెప్పవారు కుడా పాదయాత్ర చేస్తున్నారు.. పార్టీలు పెడుతున్నారని ఆయ‌న కామెంట్ చేశారు. అయితే.. ఎవరు పైసలు ఇస్తే వారికి సర్వేలు చేస్తున్నారని విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని.. రాహుల్ గాంధీ లాగా ప్రశాంత్ కిషోర్ కూడా పాదయాత్ర చేస్తారట.. ఆయ‌న‌ను ఎవరు గుర్తు పడతారని ఎద్దేవా చేశారు.

యూపీలో సలహాలు ఇచ్చావు పార్టీని ఖతం చేసావు. నువ్వు ఏమైనా త్యాగం చేసావా.. ప్రజలకోసం పోరాడవా.. డబ్బుల కోసం నువ్వు సర్వేలు చేస్తావ్.. నితీష్ కుమార్, తాము అందరం కలిసి..సెక్యులర్ పార్టీలుగా బీజేపీ కి వ్యతిరేకంగా పోరాట చేస్తున్నాం. బీజేపీకి తొత్తుగా నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నావ్.. నిన్ను ఎవరు నమ్ముతార‌ని ప్ర‌శాంత్ కిషోర్‌ను ప్ర‌శ్నించారు. నిన్నటి వరకు బీజేపీ వ్యతిరేకం అన్నావు.. మతతత్వ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నావని మండిప‌డ్డారు.

కొడుకు రాహుల్‌ కోసం తల్లి సోనియా గాంధీ కూడా పాదయాత్ర చేస్తుందని తెలిపారు. జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ నడిచినట్టు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడవాలని అన్నారు. దేశంలో ప్రజలు కోరుకుంటున్నారా..? అని తెలుస్తోంద‌ని అన్నారు. చండూరు లో కాంగ్రెస్ ఆఫీస్ ని తగులబెట్టారు. ఈ విష‌య‌మై ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ త‌గులబెట్టాయా తెలాలని అన్నారు. 24 గంటలు టైం ఇస్తున్న.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తాం.. తాడో పేడో తేల్చుకుంటామ‌ని హెచ్చ‌రించారు. రాహుల్ గాంధీ మీటింగ్ ఏర్పాట్ల పై నగర కాంగ్రెస్ మీటింగ్ జరిగిందని తెలిపారు.


Next Story