తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు నిజం కావు.. ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు. నా ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన ఉనికి కోసమేనన్నారు. నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయం అని పేర్కొన్నారు. నా గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారని.. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలలో భాగంగానే మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచిందన్నారు.
కవిత జైల్లో ఉండడంతో ఆమెను బయటకు తెచ్చేందుకు బీఆర్ఎస్, బీజేపీకి అమ్ముడుపోయిందన్నారు. గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంపీగా పని చేసిన మహబూబ్ నగర్ లో సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్‌లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు నా గెలుపు కోసం సమిష్ట కృషి చేశారని పేర్కొన్నారు.