ఏప్రిల్ 1న చ‌ర్చ‌కు రండి : వీహెచ్

Congress Leader V Hanumantharao. రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ కొత్త ఆరోపణలు చేస్తున్నారని

By Medi Samrat  Published on  29 March 2023 9:15 PM IST
ఏప్రిల్ 1న చ‌ర్చ‌కు రండి : వీహెచ్

Congress Leader V Hanumantharao


రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ కొత్త ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించ పరుస్తూ మాట్లాడాడని.. రాహుల్ గాంధీ ఓబీసీలకు క్షమాపణలు చెప్పాలని.. కొత్త వాదన వినిపిస్తున్నారని.. ఎందుకు క్షేమపణలు చెప్పాలి ? అదానీపై పార్లమెంట్ లో ప్రశ్నించినందుకా అని అడిగారు. అదానీ విషయంపై ప్రజల దృష్టి మరల్చడానికే ఓబీసీల అంశాన్ని తెర మీదకు తెచ్చారని వీహెచ్ అన్నారు.

ఏప్రిల్ 1వ తేదీన అన్ని పార్టీలతో సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాన‌ని.. రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించ పరిచారు అనే విషయంపై చర్చిద్దామ‌ని వీహెచ్ అన్నారు. ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏం చేశాయి.. తొమ్మిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందనే విషయంపై చర్చిద్దామ‌న్నారు. అదానీ గురించి మాట్లాడితే ఓబీసీ అంశాన్ని తెరమీదకు తెచ్చి.. ప్రజల దృష్టి మరల్చడానికీ బీజేపీ ప్రయత్నిస్తుంద‌ని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయలకు బీజేపీ ఓబీసీ అంశాన్ని వాడుకుంటుందని ఆరోపించారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో సహా ఓబీసీ విద్యార్థులు, మేధావులను పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాయ‌నాడ్ ఎన్నికలకు 30 రోజుల గడువును ఇస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది.. సీఈసీకి ఉన్న ఆలోచన పార్లమెంట్ లో స్పీకర్ లేదని తేలిపోయిందని.. స్పీకర్ బీజేపీ పార్టీకి తోత్తుగా పని చేస్తున్నార‌ని వీహెచ్ విమ‌ర్శించారు.


Next Story