తెలంగాణ తెచ్చింది మేము : వీహెచ్‌

Congress Leader V Hanumantha Rao Fire On CM KCR. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లే రాలేదు.. తెలంగాణ తెచ్చింది మేము.. ఇచ్చింది

By Medi Samrat
Published on : 14 Feb 2023 9:00 PM IST

తెలంగాణ తెచ్చింది మేము : వీహెచ్‌

తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లే రాలేదు.. తెలంగాణ తెచ్చింది మేము.. ఇచ్చింది మేము అని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా భ‌ద్రాచ‌లంలో జరుగుతున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. స‌భ‌కు వ‌చ్చిన ఈ జనాన్ని చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది.. మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ అంటున్న కేసీఆర్.. వైన్ షాపులు పెంచడంలో నెంబర్ వన్ అయ్యారని ఎద్దేవా చేశారు.

నల్ల ధనం వెనక్కి తెస్తామన్న మోదీ.. 2 వేల నోటు తెచ్చి మరింత పెరిగేలా చేశారని మండిప‌డ్డారు. హాంగ్ వస్తుందని చెప్పి కోమటిరెడ్డి కార్యకర్తలను గందరగోళంలోకి నెడుతున్నారని.. ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయొద్దని.. వీలైతే మేమున్నామని ధైర్యం చెప్పండని హితువు ప‌లికారు. మాలో విభేదాలు లేవు.. అందరం కలిసే ఉన్నామ‌న్న వీహెచ్‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని అన్నారు.


Next Story