పుష్ప సినిమాకు వచ్చిన డబ్బులు హుండీలో వేయండి : వీహెచ్‌

బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు.. ఆయనకు సలహా ఇచ్చింది ఎవరని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్ర‌శ్నించారు.

By Medi Samrat  Published on  23 Dec 2024 7:35 AM GMT
పుష్ప సినిమాకు వచ్చిన డబ్బులు హుండీలో వేయండి : వీహెచ్‌

బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు.. ఆయనకు సలహా ఇచ్చింది ఎవరని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్ర‌శ్నించారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని తాను దేవుణ్ణి కోరుకుంటున్నాన‌ని తెలిపారు. పుష్ప సినిమా టికెట్ రేట్‌ను హోం మంత్రిగా రేవంత్ రెడ్డి పెంచారు.. ఆ విష‌యం అల్లు అర్జున్ ఆలోచించాలని.. పుష్ప సినిమాకు వచ్చిన లాభాలలో కొంత మొత్తం యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి హుండీలో వేయండని సూచించారు.

పొలిటికల్ పార్టీలు ఎంత సేపటికి రాజకీయ కక్ష అంటున్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క‌క్ష సాధింపు చర్య అంటుండు.. మా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ.. మణిపూర్ లో 90 మంది చనిపోయారు.. అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు.. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందని.. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ తప్పొద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఈ విష‌యాన్ని సీరియస్‌గా తీసుకున్నార‌న్నారు.

సంజయ్ దత్ విషయంలో ఆయన తండ్రి, కాంగ్రెస్ ఎంపీ సునీల్ దత్ కొడుకు తప్పు ఒప్పుకుండని.. అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా ఈ విష‌య‌మై ఆలోచించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు శవాల మీద పేలాలు ఎరుకునే రకం.. ఇప్పటికైన రాజకీయ డ్రామాలు ఆపండని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Next Story