తెలంగాణలో పించన్లు పెంపు, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం పథకాలపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మునిసిపాలిటీలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు పథకాలను అమలు చేసినట్లు సంపత్ అన్నారు. బీఆర్ఎస్S ప్రభుత్వ దోపిడీతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను రేవంత్ సరిచేస్తున్నారు. మార్చి తర్వాత పింఛన్లను రూ. 4 వేలకు పెంచుతాం. మహిళలకు రూ.2,500 ఇస్తాం..అని సంపత్ తెలిపారు.