తెలంగాణలో సుమారు 50 లక్షల మందికి పైగా మహిళలను కేసీఆర్ మోసం చేశారని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి విమర్శించారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అభయహస్తం, బంగారు తల్లి పథకాలు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించారు. దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. పాల్వంచలో కేటీపీఎస్‌ను కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశామని వెల్లడించారు.
800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఆగిపోయింది ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే అవినీతి వలన ప్రభుత్వం పతనం అవుతుందని జోష్యం చెప్పారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు ఎలాంటి సహాయం అందడం లేదని అన్నారు. కేసీఆర్ మొదటి కేబినెట్ లో మహిళా మంత్రినే లేరని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. గిరిజన హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు.