ప్ర‌సంగం మ‌ధ్య‌లో ఎడ్లబండి మీద‌ నుంచి కిందపడిన రాజనర్సింహ

Congress Leader Raja Narasimha Slips From Cart. కేంద్ర‌ప్ర‌భుత్వం పెట్రోల్‌ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో

By Medi Samrat  Published on  12 July 2021 10:07 AM GMT
ప్ర‌సంగం మ‌ధ్య‌లో ఎడ్లబండి మీద‌ నుంచి కిందపడిన రాజనర్సింహ

కేంద్ర‌ప్ర‌భుత్వం పెట్రోల్‌ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు ర్యాలీలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మెదక్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నాచౌక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఎడ్లబండ్లను ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఓ ఎడ్లబండి పైన నిలుచుని రాజనర్సింహ ప్రసంగిస్తుండగా అపశృతి చోటుచేసుకుంది.


ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురై, బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కార్య‌క్ర‌మంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే.. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి కూడా ఈ ఆందోళ‌న‌ల‌లో పాల్గొన్నారు. ఈ ఉద‌యం ఆయ‌న హైద్రాబాద్ నుండి నిర్మ‌ల్ కేంద్రంగా జ‌రిగే నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు. ఆయ‌న వెంట ఏఐసీసీ కార్యక్రమాల సమన్వయ కర్త ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు.


Next Story