కేసీఆర్‌కి ఆ అవార్డు ఇవ్వాలి : పుష్పలీల
కేసీఆర్ ఎన్నికల్లో ఎన్నో అబద్దాలు ఆడుతున్నారని పీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల అన్నారు.
By Medi Samrat Published on 10 Nov 2023 8:44 AM GMTకేసీఆర్ ఎన్నికల్లో ఎన్నో అబద్దాలు ఆడుతున్నారని పీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల అన్నారు. గాంధీభవన్‌లో ఆమె మాట్లాడుతూ.. 9 ఏళ్లలో కేసీఆర్ ఎప్పుడైనా ఇన్ని మీటింగ్ లు పెట్టారా.? అని ప్రశ్నించారు. అబద్దాలకు పేటెంట్ రైట్ కేసీఆర్ కి మాత్రమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా పని చేస్తున్నారని కొనియాడారు.
దళిత ద్రోహి కేసీఆర్ కి అవార్డు ఇవ్వాలని అన్నారు. దళిత ముఖ్యమంత్రి అన్నారు.. దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి.. దళితులకు సబ్ ప్లాన్ ఏమైంది.. ఎంతమందికి దళితబంధు ద్వారా రూ.10 లక్షల సహాయం చేశారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ క్యాడర్ కి మాత్రమే దళితబంధు ఇచ్చారని ఆరోపించారు. ఎంతమంది మాదిగలకు మంత్రి పదవులు ఇచ్చావని ప్రశ్నించారు. మా మాదిగ సామాజిక వర్గానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు కాంగ్రెస్ ఎం చేసిందని అంటావా.? నువ్వు ముఖ్యమంత్రి అయ్యావంటే కాంగ్రెస్ వాళ్ళే కారణమన్నారు.
దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ బిడ్డల రక్తం తాగుతున్నావ్.. నీ కుటుంబం మాత్రమే ఏలుతుందన్నారు. దళిత ద్రోహి కేసీఆర్ మీద చీటింగ్ కేసు పెట్టాలన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో వేల కోట్లు దోచిన దొంగ హరీష్ రావు అని ఆరోపించారు. మాకు బడ్జెట్ లో ఒక శాతం కూడా కేటాయించడం లేదన్నారు.