ఎవరి బలమెంతో ప్రజలందరికి తెలుసు.. దయ చేసి తనను గెలకొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. కాంగ్రెస్ క్రమ శిక్షణా కమిటీతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అంటే నాకు గౌరవం, కాంగ్రెస్ ను గౌరవిస్తానన్నారు. అంతేకాకుండా రేవంత్ అన్న మళ్లీ సీఎం అవ్వాలి.. బీసీ నాయకుడు మహేష్ అన్నకు మరిన్ని పదవులు రావాలని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయినందుకు సంతోషపడుతున్నా. నేను మాట్లాడింది తప్పా? లేదా? అన్నది తన అంతరాత్మకు తెలుసన్నారు.
కొండా మురళి తమపై చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌తో పాటు, క్రమ శిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలంటూ కొండా మురళీకి క్రమ శిక్షణా కమిటీ నోటీసులు పంపించింది. నేడు గాంధీ భవన్‌లో క్రమశిక్షణా కమిటీ ముందుకు కొండా మురళి వచ్చారు.