మోదీ మెడలు వంచుతా అని.. మెడలు వంచుకుని వచ్చారు

Congress Leader Jeevan Reddy Fires On CM KCR. రాష్ట్ర రైతాంగం రెండు సమస్యలు ఎదుర్కొంటోందని.. ఖరీఫ్ వరి కొనుగోలు చేయడం లేదు.

By Medi Samrat  Published on  26 Nov 2021 9:24 AM GMT
మోదీ మెడలు వంచుతా అని.. మెడలు వంచుకుని వచ్చారు

రాష్ట్ర రైతాంగం రెండు సమస్యలు ఎదుర్కొంటోందని.. ఖరీఫ్ వరి కొనుగోలు చేయడం లేదు.. రబీ పంటపై స్పష్టత లేక ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తొడుదొంగళ్ల మారారని విమ‌ర్శించారు. చివరిగింజ వరకు కొంటా అని గొప్పగా చెప్పిన కేసీఆర్.. ఏమైంది అని ప్ర‌శ్నించారు. నీకు సహకరించనిది.. కేంద్రం తెచ్చిన బిల్లులకు ఎందుకు మద్దతు ఇచ్చినవ్ అని నిల‌దీశారు. మోదీ మెడలు వంచినవా లేక కేసీఆర్ నీ మెడలు వంచుకున్నవా అని ఫైర్ అయ్యారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టాలని అన్నారు.

రైస్ మిల్లర్ల చెప్పు చేతుల్లో పాలన యంత్రాంగం ఉన్నట్లు కనిపిస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. కేంద్రం స్పందించకుంటే రైతులను రోడ్డున పడేస్తావా..? అని ప్ర‌శ్నించారు. కేంద్రం రా రైస్ కొంటా అంటోందని.. ఉప్పుడు బియ్యం వల్ల నూక తక్కువ వస్తుందని.. రా రైస్ వల్ల నూక ఎక్కువ వస్తుందని.. రా రైస్ ను చేయడం వల్ల కేవలం ఎకరానికి 10వేల భారం పడుతుందని.. మీ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల ఎక్కడ పోయారని ప్ర‌శ్నించారు.

ఇతర పంటలకు మద్దతు ధర లేకనే రైతులు వరి వైపు మళ్లారని.. చివరి గింజ వరకు నేనే కోంట అని గొప్పలు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదని అంటున్నారని.. మోదీ మెడలు వంచుతా అన్న కేసీఆర్.. మెడలు వంచుకుని వచ్చార‌ని విమ‌ర్శించారు. రైతులు కళ్లాల్లో ఇబ్బంది పడుతుంటే.. టీఆర్ఎస్ నాయకులు ఎక్కడున్నారని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఢిల్లీలో.. కలెక్టర్ లు వాళ్ళ ఇళ్ల‌ల్లో ఉంటున్నారని.. రైతుల సమస్య పట్టించుకోవడం లేదని విమ‌ర్శించారు.


Next Story
Share it