ప్రజాస్వామ్య పోరాటాలను ప్రభుత్వం ఆహ్వానించాలి : జానారెడ్డి

Congress Leader Janareddy Visit Goshamahal Police Station. పోలీస్ రిక్రూట్ మెంట్ విషయం లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. వాటిని సవరించాలని నిరుద్యోగులు

By Medi Samrat
Published on : 31 Dec 2022 5:45 PM IST

ప్రజాస్వామ్య పోరాటాలను ప్రభుత్వం ఆహ్వానించాలి : జానారెడ్డి

పోలీస్ రిక్రూట్ మెంట్ విషయం లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. వాటిని సవరించాలని నిరుద్యోగులు కోరుతున్నారని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి అన్నారు. గోషామహాల్ పీఎస్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించిన ఆయ‌న మాట్లాడుతూ.. నిరుద్యోగులకు మద్దతు గా యూత్ కాంగ్రెస్ ఆందోళన చేసింది. ప్రభుత్వం స్పందించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసింది. ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. సమస్య పరిష్కరానికి అంతే చిత్తశుద్ధి తో వ్యవహరించాలని అన్నారు.

నిరుద్యోగ సంఘాలతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అరెస్ట్ చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను విడిచి పెట్టాలని పోలీసులను కోరారు. నిరసనలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి.. వారిని ఆసుపత్రిలో చేర్పించాం.. ప్రభుత్వం సహాయం చేస్తే ఉన్నతంగా ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్య పోరాటాలను ప్రభుత్వం ఆహ్వానించాలి.. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని జానారెడ్డి అన్నారు. ప్రజలందరికీ జానారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


Next Story