సీఎం కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్

Congress Leader Janareddy Slams CM KCR. కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత జానారెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. హాలియాలో కాంగ్రెస్

By Medi Samrat  Published on  27 March 2021 2:44 PM GMT
సీఎం కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్

కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత జానారెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో ఆవేశంగా ప్రసంగించిన జానారెడ్డి.. కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ వస్తే తాను చేసిన అభివృద్ధిని చూపిస్తానని అన్నారు. తాను సాగర్‌కు ఏం చేశానో అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్ నాయ‌కులు తాము నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని, కేసీఆర్‌ వస్తే తీసుకెళ్లి చూపిస్తానని స‌వాల్ విసిరారు. సాగర్‌ ద్వారా నీళ్లు ఇచ్చింది తామేనని గుర్తుచేశారు. సర్పంచ్‌గా గెలవలేని వాళ్లు ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారని ఫైర్ అయిన ఆయ‌న‌.. సంతలో పశువుల్లా అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు.

తండాలకు వెలుగులు తెచ్చింది తానేనని చెప్పిన ఆయ‌న‌.. జానారెడ్డి అంటే పోరాటయోధుడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ ‌ హయాంలో 2 లక్షల ఎకరాలు పేదలకు పంచామని అన్న ఆయ‌న‌.. టీఆర్‌ఎస్‌ కనీసం 10 వేల ఎకరాలు పంచలేదని జానారెడ్డి ఆరోపించారు. డబ్బులకు అమ్ముడుపోయి బానిసలుగా మారొద్దని.. డబ్బు వెదజల్లి ఓట్లు కొనాలని చూస్తున్నారని.. సాగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియాకు బహుమతిగా ఇద్దామని జానారెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట, గజ్వేల్‌ కన్నా తమ దగ్గరే రోడ్లు బాగున్నాయని తెలిపారు. నామినేషన్లు వేసి అందరం ఇంట్లోనే ఉందాం. కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో.. బీజేపీ నేతలు వాళ్ల భవన్‌లో కూర్చొండి. నేను గాంధీభవన్‌లో కూర్చుంటా.. ఎవరు గెలుస్తారో చూద్దాం. వారసులు అంటే నా కొడుకో..బిడ్డో కాదు..ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త నా వారసుడే'' అని జానారెడ్డి తెలిపారు.Next Story
Share it