జనంలోకి రావడానికి మా మంత్రులు సిద్ధం.. కేటీఆర్ నువ్వు సిద్ధమా? : జ‌గ్గారెడ్డి

సోనియా గాంధీ.. రాహూల్ గాంధీ.. ఖర్గేల నాయకత్వంలో సిఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిలది బెస్ట్ బడ్జెట్ అని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  25 July 2024 8:30 PM IST
జనంలోకి రావడానికి మా మంత్రులు సిద్ధం.. కేటీఆర్ నువ్వు సిద్ధమా? : జ‌గ్గారెడ్డి

సోనియా గాంధీ.. రాహూల్ గాంధీ.. ఖర్గేల నాయకత్వంలో సిఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిలది బెస్ట్ బడ్జెట్ అని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. రేవంత్.. భట్టిలది అభివృద్ధి బడ్జెట్.. కేసీఆర్ ది అప్పుల బడ్జెట్.. వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ ది.. ఊహల బడ్జెట్ గత బీఆర్ఎస్ దని అన్నారు. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది. 10 వేల కోట్లతో హైద్రాబాద్ దశ మార్చాలని రేవంత్ ఆలోచన.. హామీల అమలుపై జనంలోకి రావడానికి మా మంత్రులు ఉత్తమ్.. భట్టి.. తుమ్మల..పొన్నం సిద్ధం.. కేటీఆర్ నువ్వు సిద్ధమా? అని స‌వాల్ విసిరారు. చీల్చుడులో మేమే ఎక్స్పర్ట్.. కేసీఆర్ కాదన్నారు. మా దగ్గర రాజకీయాలు నేర్చుకున్న కేసీఆర్ కి ఛీల్చుడు ఏం తెలుసు అని అన్నారు.

భట్టి బడ్జెట్ బిందల్లో నీళ్లు ముంచుకుని తాగినట్టు ఉంది.. కేసీఆర్ బడ్జెట్ చెరువులో నీళ్ళు తెచ్చుకుని తాగినట్టుగా ఉండూద‌ని అన్నారు. మాటకు కట్టుబడి.. వాస్తవానికి దగ్గరలో కాంగ్రెస్.. కాంగ్రెస్ బడ్జెట్ ఉంటుందన్నారు. ఎవరైనా దావల్‌ ఇస్తే.. నాన్ వెజ్ కి ప్రయార్టి ఇస్తాం.. కేసీఆర్ బడ్జెట్ ఎట్లా ఉంటది అంటే దావత్‌కి పోతే మటన్ బిర్యాని తిని రావచ్చు అన్నట్టు ఉంటది. ఊరందరికీ మటన్ బిర్యానీ వండుతున్నామ‌ని అని ప్రచారం చేస్తారు. పొయ్యి మీద గిన్నె లు పెడతారు కానీ మటన్ ఉండదు.. మటన్ ఎప్పుడు వస్తుందో అని మనం ఎదురు చూస్తాం.. మటన్ ఉండ‌దు.. ఏం ఉండ‌ద‌న్నారు. ప్రజలను బడ్జెట్ విషయంలో కేసీఆర్ కూడా అట్లనే మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ది.. పప్పు.. మజ్జిగ.. ఉండి.. ఇది ఉంది తృప్తిగా తినండి అని నిజం చెప్పినట్టు ఉంటుంద‌న్నారు. మంచి బడ్జెట్ పెట్టిన సీఎం రేవంత్.. డిప్యూటీ సిఎం భట్టి.. శ్రీధర్ బాబుకి శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

ఆరు గ్యారెంటీలకు సరిపడ నిధులు కేటాయించారు. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది. హైదరాబాద్ కి 10 వేల కోట్లు మంచి నిర్ణయమ‌న్నారు. తెలంగాణకి గుండెకాయ లాంటిది హైదరాబాద్ అన్నారు. 10 వేల కోట్లు తో హైదరాబాద్ అభివృద్ధి చేస్తే.. పారిశ్రామిక వేత్తలు విరివిగా రావచ్చన్నారు. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది.. కార్మికులు... పరిశ్రమలు అభివృద్ధి జరుగుతుందన్నారు.

హైదరాబాద్ కు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది. దేశంలో వ్యాపారస్తులు హైదరాబాద్ కి ప్రాధాన్యత ఇస్తారు. బీఆర్ఎస్‌ ఇలా చేయలేదు.. హైదరాబాద్ కి మీరు నిధులు పెట్టలేదు.. మేము పెడుతున్నామ‌న్నారు. మేము హైదరాబాద్ కి 10 వేల కోట్లు పెడితే కేసీఆర్ కుళ్లుకుంటున్నారు. ఎందుకు అంత కుళ్ళు అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ వేసిన ఫ్లైఓవర్ లకు కేటీఆర్ రిబ్బన్ కట్ చేశారన్నారు. కేసీఆర్ ది అప్పులకు ప్రాధాన్యత.. అభివృద్ధి ఆలోచన రేవంత్.. భట్టిదన్నారు.

అప్పుల చరిత్ర బీఆర్ఎస్‌ది.. అభివృద్ధి చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు. కేటీఆర్.. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి..ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్.. పొన్నం ఇద్దరు ఆర్టీసీ బస్సులో ఎక్కండి.. ఉచితంగా బస్సు లో మహిళలు వెళ్తున్నారా లేదా అని తెలుస్తుందన్నారు. తుమ్మలతో కలిసి రైతుల దగ్గరికి పొండి.. రుణాలు మాఫీ ఐతున్నాయా లేదో తెలుసుకోండన్నారు. నువ్వు బీఆర్ఎస్‌ కార్యాలయంలో కూర్చొని.. మేము గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడటం ఎందుకు అన్నారు. భట్టితో కలిసి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుందో లేదో చూడండని అన్నారు. ఉత్తమ్ నీ తీసుకుని వెళ్లి 500 సిలిండర్ ఇస్తున్నారో లేదో అడగండి.. చీల్చుడు లో మేము ఎక్స్పర్ట్.. కేసీఆర్ కాదు..కేసీఆర్ రాజకీయం మా దగ్గర నేర్చుకున్నోడివే.. నీ కంటే ఎక్కువ డైలాగ్ కొట్టే వాళ్ళు మా దగ్గర వంద మంది ఉన్నారని అన్నారు.

Next Story