ఆయ‌న వైట్ పేపర్ లాంటి వారు.. ఇంకు చ‌ల్ల‌కండి : జగ్గారెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వార‌ని.. ఆయనపై ఇంకు చల్లకండని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు ప‌లికారు

By Medi Samrat  Published on  23 May 2024 5:21 PM IST
ఆయ‌న వైట్ పేపర్ లాంటి వారు.. ఇంకు చ‌ల్ల‌కండి : జగ్గారెడ్డి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వార‌ని.. ఆయనపై ఇంకు చల్లకండని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు ప‌లికారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లిడర్ ఏలేటి మహేశ్వరెడ్డి బట్టకాల్చి మీద వేస్తుండని ఫైర్ అయ్యారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయనకు కోపమొచ్చిందో అర్థం కాలేదన్నారు.

ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు.. ఆయన మీద ఇంక్ జల్లుతున్నారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి.. రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందని.. తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పారు. రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడొద్దని.. నష్టపోవొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందన్నారు. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం సహజమేన‌న్నారు.

Next Story