కోమటిరెడ్డి .. కోమటిరెడ్డే .. దట్సాల్..! నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై వస్తున్న సోషల్ మీడియా కథనాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.
By - Medi Samrat |
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై వస్తున్న సోషల్ మీడియా కథనాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై వస్తున్న నిరాధార కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. ఎవరైనా దురుద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయాలని ప్రోత్సహించినా.. అది మంచి పద్దతి కాదన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాయాలని ఒక వేళ ప్రేరేపిస్తే ఆ వ్యక్తులది అతి పెద్ద తప్పు.. అలా ప్రేరేపించినోడికి.. ప్రేరేపిస్తే వేసినోడికి బుద్ధి లేదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక చరిష్మా ఉన్న నేత, పొలిటికల్ ఫిగర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్ఎస్‌యూఐ నుండి మొదలుకుని ఒక విద్యార్థి నేతగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, మంత్రిగా అంచెలంచెలుగా కష్టపడి ఎదిగిన నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిది ఒక చరిత్ర.. ఎంతో కష్టపడి, వ్యయ ప్రయాసలకోర్చి అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు.
ఒక ఆడ, మగ మాట్లాడితే పెడర్థాలు తీస్తారా.? చెత్తనా కొడుకులారా.? అని ధ్వజమెత్తారు. ఇదొక ప్రజా సమస్యనా..? రాష్ట్ర సమస్యనా.? పనిగట్టుకుని బురద జల్లుతున్నారు.. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు బదులు.. ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను వెలికితీయండని సూచించారు. ఎవడ్రా మీకు చెప్పింది.. ఇలాంటి వార్తలు రాయమని.. చేతిలో కలం ఉందని ఏది పడితే అది రాస్తారా.? మీ అక్కతోనో, చెల్లితోనో, అమ్మతోనో మాట్లాడితే ఇలానే రాస్తారా? ఇదెక్కడి సాంప్రదాయం? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు
కష్టపడి ఎదిగిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై బురద జల్లుతార్రా ఫూల్స్.. చెత్తనా కొడుకుల్లారా అంటూ నిప్పులు చెరిగారు. లక్షలు, కోట్లు అప్పులు చేసి ప్రజలకు సర్వీస్ చేసి వస్తాం.. మమ్మల్నా మీరు బద్నాం చేసేది.? నాలుగు అక్షరం ముక్కలు వస్తాయని.. చెత్త వార్తలు రాసి పర్సనాలిటీ డామేజ్ చేస్తారా.? కోమటి రెడ్డిపై వార్తలు రాయాలని చెప్పిన వాడికి బయటకు వచ్చి చెప్పే దమ్ముందా.? మీరు వార్తలు రాసినంత మాత్రాన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యారెక్టర్ డ్యామేజ్ అయితధా? కోమటి రెడ్డి .. కోమటి రెడ్డే .. దట్సాల్ అంటూ ముగించారు.