రైతుల పేరుతో సినిమా తీసి చిరంజీవి కోట్లు సంపాదించారు.. పవన్‌కు ఆయన ఆ విషయం ఎందుకు చెప్పలేదు.?
తెలంగాణలో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ మొదలైందని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 19 July 2024 4:14 PM ISTతెలంగాణలో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ మొదలైందని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నిన్న లక్ష వరకు రుణాలు ఉన్న వారికి మాఫీ అయ్యింది. ఆగస్టు పదిహేను వరకు 2లక్షల రుణమాఫీ అవుతుందని తెలిపారు. రుణమాఫీతో బీజేపీ, BRS వాళ్లకు నిద్రపట్టడం లేదని అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయగానే రైతుల ఇళ్లల్లో సంబరాలు.. ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఆందోళనలు జరిగాయన్నారు. కొందరు బీజేపీ, BRS నేతలు నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నారని ఎద్దేవా చేశారు.
హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన మామ సీఎంగా ఉండి.. పది ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. అందులో రైతుల రుణమాఫీ చేసింది కేవలం 26 వేల కోట్లు మాత్రమేనన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం.. 6 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31వేల కోట్ల రుణమాఫీ మొదలైందన్నారు. నాలుగున్నర ఏళ్ల సమయం ఉన్నా.. ఆరు నెలల్లోనే రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు.
బీజేపీ పదేళ్లు కేంద్రంలో ఉండి దేశంలో ఉన్న రైతులకు ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా అని బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించారు. పదేళ్లలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి పది మందికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. అందులో రైతులు ఉన్నారా చెప్పండని డిమాండ్ చేశారు. యూపీఏ హాయంలో ఒకే సారి 75 వేల కోట్లు రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
పదేళ్లలో రైతులు కేసీఆర్ మీద పెట్టుకున్న ఆశలను కూనీ చేశారని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు తెచ్చి.. రైతు హత్యలు చేశారు. దీని మీద చర్చకు వస్తారా అని బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. ఢిల్లీలో రైతులు నిరసనలు తెలిపితే.. మంత్రుల పిల్లల వాహనాలతో మర్దర్లు చేశారన్నారు.
రైతుల పక్షాన అన్నట్లు చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారని.. ఢిల్లీలో రైతులు నిరసనలు చేస్తుంటే ఎందుకు చిరంజీవి మద్దతు తెలుపలేదన్నారు. చిరంజీవి సినిమా హిట్.. రైతులు ఫట్ అన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తుంటే.. రైతుల గురించి ఎందుకు చెప్పలేకపోయారన్నారు. ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే.. రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారన్నారు. రైతుల పేరుతో సినిమాలు తీసి.. కోట్లు సంపాదించుకొని బీజేపీ కి మద్దతు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.
కేటీఆర్ ట్వీట్ కే పని కి వస్తాడు.. పనికి పనికిరాడన్నారు. రైతులకు ఒకే సారి రుణమాఫీ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని.. అందుకే లక్ష.. లక్షన్నర.. రెండు లక్షలు అన్న విడతలు పెట్టామన్నారు. అప్పులు ఎక్కడ తెచ్చారు అనేది సీఎం, ఆర్థిక మంత్రిలకే తెలుసు అన్నారు.