బీజేపీ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. లెఫ్ట్ భావాజాలం గల ఈటెల బీజేపీలో ఎలా చేరారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్ ప్రశ్నించారు. అమిత్ షాను కలిసేందుకు హైదరాబాద్ నుండి ఏవరి విమానంలో ఈటెల వెళ్లారో తెలియదా.. కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ఈటెల బీజేపీలో చేరారని అన్నారు. కేసీఆర్, ఈటెల మధ్య మంచి అవగాహన ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ బలం తగ్గించేందుకు కేసీఆర్, ఈటెల వ్యూహం పన్నారని ఆరోపించారు.
Congress Leader Eravathri Anil Kumar
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అవగాహన ఓప్పందంలో భాగంగానే ఈటెలపై కేసీఆర్ బలహీన వ్యక్తిని పోటీలో పెట్టారని ఆరోపించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని కోట్లు వచ్చాయో ఈటెల లెక్క చెప్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని అడిగారు. ఈటెల భ్యాగ్యలక్ష్మి ఆలయానికి రాకుంటే.. తప్పు ఒప్పుకుని గాంధీ భవన్ ముందు ముక్కు నేలకు రాయాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ లేని వ్యక్తి అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కోవర్ట్ వ్యక్తిత్వం ఉన్న కౌశిక్ రెడ్డి చేసే ఆరోపణలకు విలువ ఉండదని అన్నారు.
మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ రూ.25 కోట్లు కాంగ్రెస్ కు ఇచ్చారని ఈటెల ఆరోపించారు. ఈటెల రాజేందర్ ఆరోపణలపై రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని ఈటెలకు రేవంత్ సవాల్ విసిరారు. సాయంత్రం 6 గంటలకు ఈటెలను చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి రావాలన్న రేవంత్.. ఆలయంలో తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ నుంచి గాని, కేసీఆర్ నుంచి సాయం పొందలేదన్న రేవంత్.. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని స్పష్టం చేశారు.