దీన్ని కిడ్నాప్ అంటారా లేక అరెస్ట్ అంటారా? : యాంకర్ రఘు అరెస్టుపై కాంగ్రెస్ నేత ట్వీట్
Congress Leader Dasoju Sravan on Anchor Raghu Arrest. ప్రముఖ తెలుగు యాంకర్, జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 8 Jun 2021 6:18 PM ISTప్రముఖ తెలుగు యాంకర్, జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మల్కాజిగిరిలో రఘు నివాసానికి సమీపంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రఘును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ వార్తలు వస్తున్న నేఫథ్యంలో అతని అరెస్టుపై క్లారిటీ ఇచ్చారు పోలీసులు. రఘును అరెస్టు చేసినట్టు తెలిపారు.
అయితే.. రఘు అరెస్ట్ కు సంబంధించి సీసీ టీవీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పండ్ల బండి వద్ద రఘు పళ్లు తీసుకుంటుండగా.. మఫ్టీలో ఉన్న పోలీసులు రఘును బలవంతంగా కారులో ఎక్కిస్తున్నట్లు అందులో ఉంది. అయితే.. కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ కుమార్ రఘును అదుపులోకి తీసుకుంటున్న ఆ వీడియోను ట్వీట్ చేస్తూ.. తెలంగాణ డీజీపీకి ప్రశ్నలు సంధించారు.
దీన్ని కిడ్నాప్ అంటారా లేక అరెస్ట్ అంటారా? వీళ్లు పోలీసులా లేక గులాబీ గూండాలా? ఇదేం రాజ్యం? ఒక జర్నలిస్ట్ పై ఇంత దారుణం ఎందుకు? నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా? నిరంతరం ఫ్రెండ్లీ పోలీసు గూర్చి తపించే తెలంగాణ డీజీపీ గారు.. ఈ పోలీసులపై మీరు ఏంచర్య తీసుకుంటారు? అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీన్ని కిడ్నాప్ అంటారా లేక అరెస్ట్ అంటారా?
— Dr Sravan Kumar Dasoju (@sravandasoju) June 8, 2021
వీళ్లు పోలీసులా లేక గులాబీ గూండాలా?
ఇదేం రాజ్యం?
ఒక జర్నలిస్ట్ పై ఇంత దారుణం ఎందుకు?
నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా?
నిరంతరం ఫ్రెండ్లీ పోలీసు గూర్చి తపించే @TelanganaDGP గారు, ఈ పోలీసులపై మీరు ఏంచర్య తీసుకుంటారు? @INCTelangana pic.twitter.com/ZZ60IXZCkR
ఇదిలావుంటే.. యాంకర్ రఘు భార్య లక్ష్మీప్రవీణ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త రఘును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లక్ష్మీప్రవీణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులిచ్చింది. రఘు అరెస్ట్ అక్రమమో.. కాదో తేలుస్తామని హైకోర్టు పేర్కొంది. ఇక బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది.