కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు : భట్టి విక్రమార్క
Congress Leader Bhatti Vikramarka Slams CM KCR. టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రులు తెలంగాణను కాపాడేందుకు
By Medi Samrat Published on 23 Jun 2021 3:51 PM ISTదొంగలు పడ్డ అరునెలకు కుక్కలు మోరిగినట్లు.. టీఆరెస్ ప్రభుత్వం- నేతలు ఏడాదికి మేలుకున్నారని.. ఏపీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు నష్టం వస్తుందని కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు చెప్పాయి. నీటిమీద, నదులు మీద అవగాహన ఉన్న మేధావులంతా చెప్పారు. తెలంగాణ ముుఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు మాత్రం తెలంగాణ ప్రయోజనాలు అంటారు.. కానీ ఆయనకు కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు ఏమి లేవని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు ద్వారానే నీళ్లు ప్రజలకు అందుతున్నాయి.. కానీ కేసీఆర్‌తో చుక్క నీరు రాలేదని విమర్శించారు.
కేసీఆర్ తుపాకీ రామునిలా ఊర్లపొంట తిరుగుతూ ప్రగల్బాలు పలుకుతున్నారని.. రెండు పారాసెట్ మాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కోవిడ్ తగ్గుతుంది అంటే.. సీఎం ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్ లో 28లక్షలు ఎలా వసూళ్లు చేస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలని.. నిర్లక్ష్యపు మాటలే వల్లే అధికారులు నిద్రపోయారని విమర్శించారు. మరొసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని.. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు హామీలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడని భట్టి విక్రమార్క అన్నారు.