ప్రగతి భవన్ లో ప్రజా దర్భార్ నిర్వహించాలి
Congress Leader Addanki Dayakar Fire On CM KCR. ప్రగతి భవన్ పేదలకు అందుబాటు లో లేదు.. తెలంగాణ ద్రోహులు, ఆంధ్ర పైరవీకారులు,
By Medi Samrat Published on 8 Feb 2023 3:00 PM GMTప్రగతి భవన్ పేదలకు అందుబాటు లో లేదు.. తెలంగాణ ద్రోహులు, ఆంధ్ర పైరవీకారులు, ఆంధ్ర రాజకీయ నాయకులకు అడ్డాగా మారిపోయిందని కాంగ్రెస్ అధికారి అద్దంకి దయాకర్ ఆరోపించారు. తెలంగాణ వస్తే నక్సలైట్ ఎజెండా అమలు చేస్తామన్న కేసీఆర్.. తెలంగాణ కోసం పని చేసిన ఉద్యమకారులను, అమరవీరులను మరచిపోయారని విమర్శించారు..= కోదండ రామ్, గద్దర్, మందకృష్ణ లాంటి ఉద్యమ కారులను అరెస్టులు చేయించి జైల్లో పెట్టారు. జగన్, లగడపాటి రాజ్ గోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లకు ఎర్ర తివాచీలు వేసి స్వాగతలు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారి.. తెలంగాణ ప్రజలు కాలు పెట్టడానికి వీలు లేని ప్రగతి భవన్ ఎవరి కోసం.. తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంది లేకపోతే ఏంది అని నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టింది. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం.. కేసీఆర్ స్వంత ఆస్తి కాదు.. ప్రజల సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచి ఉండాలి. ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలను కలవలేదా? అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకు? ఎవరి కోసం అని ప్రశ్నించారు. ఆత్మ త్యాగలతో తెచ్చుకున్న తెలంగాణలో.. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతాం అంటూ హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఆలోచననే నేను చెప్పానన్న అద్దంకి దయాకర్.. నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 9 నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టారు. కానీ 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టలేకపోయారు.. ఎక్కడ నిర్లక్ష్యం.. ఎవరిది బాధ్యత.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల కంటే కాంట్రాక్టర్ల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్ ను గద్దె దించి ప్రజల పాలన తెస్తాం అని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు.