Telangana: 'మహిళలకు ఏడాదికి రూ.1,00,000'.. కాంగ్రెస్‌ స్పెషల్‌ మేనిఫెస్టో

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ ప్రత్యేక మేనిఫోస్టోను ప్రకటించింది.

By అంజి  Published on  3 May 2024 9:30 AM GMT
Congress, special manifesto , Telangana

Telangana: 'మహిళలకు ఏడాదికి రూ.1,00,000'.. కాంగ్రెస్‌ స్పెషల్‌ మేనిఫెస్టో

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ ప్రత్యేక మేనిఫోస్టోను ప్రకటించింది. ఐదు న్యాయాలు - తెలంగాణ ప్రత్యేక హామీలు పేరిట ఈ హామీ పత్రాన్ని పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, మంత్రి శ్రీధర్‌ బాబు, ఇతర ముఖ్య నేతలు ఆవిష్కరించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయనున్నారనే విషయాలను మేనిఫెస్టోలో వివరించారు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతి పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటన చేసింది.

విద్యావంతులైన యువకులకు నెలకు 8,500 రూపాయల ఉపకార వేతనంతో పాటు ఏడాది పాటు అప్రెంటీస్‌షిప్‌ కల్పిస్తామని తెలిపింది. ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీసం వేతనం రోజుకి రూ.400 చేస్తామని ప్రకటించింది. సామాజిక, ఆర్థిక అంశాలతో కూడిన కులగణన నిర్వహిస్తామని తెలిపింది. పంట నష్టపోయిన రైతులకు బీమా పథకం ద్వారా 30 రోజుల్లో పరిహారం ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది.

Next Story