తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విషయంలో సస్పెన్స్‌కు తెరపడింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియమితులయ్యారు.

By అంజి  Published on  6 Sept 2024 5:00 PM IST
Congress, Mahesh Kumar Goud, TPCC , Telangana

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విషయంలో సస్పెన్స్‌కు తెరపడింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రెండు వారాల క్రితమే ఈ నియామక కసరత్తు పూర్తయినా తాజాగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు సీఎం రేవంత్‌ రెడ్డి వద్ద ఉన్న టీపీసీసీ బాధ్యతలు మహేశ్‌ కుమార్‌ అందుకోనున్నారు.

1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్‌లోని భీంగల్‌ మండలం రహత్‌నగర్‌లో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ జన్మించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1986లో నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా సేవలు అందించారు. 1994లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు.

2021 జూన్‌ 26న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 2022 డిసెంబర్‌ 10న కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకం అయ్యారు. 2023 జూన్‌ 20న టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.

Next Story