పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట

తెలంగాణలో బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం ఫలించింది.

By Medi Samrat  Published on  25 Oct 2024 2:54 PM GMT
పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట

తెలంగాణలో బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం ఫలించింది. కానిస్టేబుళ్ల కుటుంబ‌స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో దిగొచ్చిన ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు స్పెషల్‌ అదనపు డీజీపీ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సెలవుల విషయంలో తెలంగాణ బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు ఊరట లభించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొత్త లీవ్‌ మాన్యువల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ మ్యాన్యువల్‌పై బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story