అట‌వీశాఖ అధికారి మృతి ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం

Condolences of minister Indrakaran Reddy on the death of FRO. గుత్తికోయ‌ల దాడిలో మ‌ర‌ణించ‌డం ప‌ట్ల అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.

By Medi Samrat
Published on : 22 Nov 2022 7:15 PM IST

అట‌వీశాఖ అధికారి మృతి ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం

గుత్తికోయ‌ల దాడిలో అట‌వీశాఖ అధికారి శ్రీనివాస‌రావు మ‌ర‌ణించ‌డం ప‌ట్ల అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకున్నారు. పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌ని చేస్తుంటే.. విధి నిర్వ‌హణ‌లో ఉన్న అధికారుల‌పై దాడులు చేయ‌డం స‌రికాద‌న్నారు. అట‌వీ ఆక్ర‌మ‌ణ‌ల‌ను స‌హించేది లేద‌ని, ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై చ‌ట్ట‌ప‌రమైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. అట‌వీ అధికారులు మ‌నోస్థైర్యం కొల్పోవ‌ద్ద‌ని మంత్రి ధైర్యం చెప్పారు. దాడి చేసిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా చూస్తామ‌న్నారు.




Next Story