ప్రజాపాలనకు ఏడాది పూర్తి.. ప్రజలకు టీపీసీసీ చీఫ్ శుభాకాంక్షలు..

ప్రజాపాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

By Kalasani Durgapraveen  Published on  3 Dec 2024 11:51 AM IST
ప్రజాపాలనకు ఏడాది పూర్తి.. ప్రజలకు టీపీసీసీ చీఫ్ శుభాకాంక్షలు..

ప్రజాపాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం పాడి ప్రజా పాలన ఏర్పాటుకు సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

మహేష్ కుమార్ ప్ర‌క‌ట‌న‌లో.. గడీల పాలన, ఫామ్ హౌస్ పాలన తో విసిగిపోయి, అవినీతి, కుటుంబ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.. నియోజక వర్గాలలో ప్రజల మనసులను గెలిచి విజయం సాధించిన శాసన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏడాది పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల సమిష్టి నిర్ణయాలతో తెలంగాణ మొదటి ఏడాదిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వెలిగిపోతోంది.. నేడు రైసింగ్ తెలంగాణగా ఉందన్న విషయం ప్రజలకు అందరికి తెలుసు.. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ప్రజల మన్ననలు పొందింది.

ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యాలు, ఆరోగ్య శ్రీ 10 లక్షల పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం.. రైతులకు 2 లక్షల రుణమాఫీ కోసం 21 వేల కోట్ల రూపాయల కేటాయింపు 23 లక్షల మందికి లబ్ది జరిగింది. ధాన్యం 500 రూపాయల బోనస్ తో ఎంతో మేలు జరిగింది. రాష్ట్రంలో ఒక్క ఏడాది లోనే సుమారు 54 వేల 500 ఉద్యోగాలు ఇచ్చి యువతను అదుకున్నాం.. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేయబోతున్నాం, డ్రగ్స్ నివారణకు కృషి జరుగుతుంది.

మూసీ నది పునర్ జీవన పథకం ఒక అద్భుతమైన పథకం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల పథకాలు, అన్ని రకాల అభివృద్ధి పనులు జరిగాయి. ఏడాదిలో అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story