ఎమ్మెల్యే ఆచూకీ తెలియడం లేదని పోలీసుల‌కు ఫిర్యాదు

Complaint to the police that MLA's whereabouts are not known. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి ఆచూకీ తెలియడం లేదని టీపీసీసీ సభ్యుడు రంగినేని అభిలాష్ రావు

By Medi Samrat
Published on : 18 Nov 2022 6:20 PM IST

ఎమ్మెల్యే ఆచూకీ తెలియడం లేదని పోలీసుల‌కు ఫిర్యాదు

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి ఆచూకీ తెలియడం లేదని టీపీసీసీ సభ్యుడు రంగినేని అభిలాష్ రావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ శాసన సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి గత 36 రోజులుగా నియోజకవర్గంలో ఎక్కడ కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే హర్ష వర్ధన్ ని అక్టోబర్ 26న ప్రగతి భవన్ కు తీసుకెళ్లారని.. ఆరోజు నుండి ఈ రోజు వరకు ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూడా రాలేదు. ఎమ్మెల్యేను బయటికి రానివ్వకుండా కేసీఆర్ వారిని ఖైదీలుగా ప్రగతి భవన్ లోనే ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు బయటకు వస్తే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా చేస్తున్న నాటకాలు, నీచ రాజకీయాలు ప్రజలకు తెలుస్తాయని కేసీఆర్ భయపడుతున్నారా ? అని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేను కాపాడి తిరిగి నియోజకవర్గానికి తీసుకురావాలని పోలీసులను కోరిన‌ట్లు తెలిపారు.





Next Story