ఉద్యోగ‌, ఉపాధ్యాయ దంపతులను క‌ల‌పండి..!

Combine Teacher Couple In 13 Districts. ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  12 Aug 2022 2:30 PM GMT
ఉద్యోగ‌, ఉపాధ్యాయ దంపతులను క‌ల‌పండి..!

ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఒకే చోట విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. వేర్వేరు ప్రదేశాల్లో విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలను ఇప్పటికైనా జరిపించాలని రాఖీ పండుగ సందర్భంగా మహిళా ఉపాధ్యాయునిలు వేడుకున్నారు. అందుకు సంబంధించిన రాఖీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

19 జిల్లాల్లో బదిలీలకు అనుమతించి.. 13 జిల్లాల ఉద్యోగుల్ని మాత్రం ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా అని అడుగుతున్నారు మహిళలు. 19 జిల్లాల స్పౌజ్ బదిలీలు ఎలా చేపట్టారో ..13 జిల్లాలకు ఆవిధంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వేరే జిల్లాలో ఉద్యోగం చేయడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నామన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. గతంలో ఇందుకు సంబంధించి పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.


Next Story
Share it