వృద్ధ యాచకురాలిపై యువకుడి దాడి.. రోడ్డుపై ఈడ్చుకెళ్తూ..

College student attacks mentally ill 70-year-old woman in Telangana. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మతి స్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలిపై యువకుడు తన

By అంజి  Published on  10 Feb 2022 11:21 AM GMT
వృద్ధ యాచకురాలిపై యువకుడి దాడి.. రోడ్డుపై ఈడ్చుకెళ్తూ..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మతి స్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలిపై యువకుడు తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. విచక్షణ కోల్పోయి రోడ్డుపై ఈడ్చుకుంటూ దాడి చేశాడు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 9వ తేదీ బుధవారం నాడు 70 ఏళ్ల వృద్ధురాలిపై కాలేజీ విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. మానసిక వికలాంగురాలు, నిరాశ్రయులైన ఆ మహిళకు స్థానికులు నిత్యం ఆహారం అందిస్తుంటారు. వృద్ధురాలి గాయాలు కావడంతో.. ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది.

దాడి ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం భిక్షాటన చేసే నిరుపేద వృద్ధురాలు సిద్దమ్మపై నిందితుడు పర్వేజ్ అనే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ బుధ‌వారం నాడు యువ‌కుడు యాచ‌కురాలిపై దాడి చేశాడు. ఆమెపై దాడి చేస్తూ కాసేపు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో ఉన్నాయి. ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తామని షాద్‌నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.

Next Story
Share it