వరద ప్రభావిత కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.

By Knakam Karthik
Published on : 4 Sept 2025 7:33 AM IST

Telangana, Cm Revanthreddy,  Kamareddy district, Flood Affected Areas

వరద ప్రభావిత కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్నారు. అనంతరం లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి-కుర్దు ఆర్&బి బ్రిడ్జ్‌ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను సీఎం పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జిఆర్ కాలనీని సీఎం సందర్శిస్తారు. అనంతరం కామారెడ్డి IDOCలో ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.

Next Story