తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లనే బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారికగా రామకృష్ణరావు నియమితులయ్యారు. ఈ మేరకుకె.రామకృష్ణరావు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కాగా 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు నుంచి ఆర్థికశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సుదీర్ఘకాలం ఆర్థిక శాఖలో చేసిన సేవలను గుర్తించిన సేవలను గుర్తించిన సర్కార్ అనుభవం దృష్ట్యా రామకృష్ణరావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.