కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు

By Medi Samrat  Published on  11 Jan 2025 9:15 PM IST
కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కొత్త ఆసుపత్రికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలను తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాల నమూనా మ్యాప్‌లను అధికారులు సీఎం ముందు సమర్పించారు. ప్రణాళికలను సమీక్షించిన ముఖ్యమంత్రి ఆసుపత్రి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.

50 ఏళ్ల అవసరాలను అంచనా వేసి ఆసుపత్రిని నిర్మించాలన్నారు. ఆసుపత్రికి నలువైపులా రహదారులు ఉండాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లు ఉండాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Next Story