మేం పాలకులం కాదు.. సేవకులం: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో గవర్నర్‌ తమిళిసై.. రేవంత్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.

By అంజి  Published on  7 Dec 2023 8:50 AM GMT
CM Revanth, Telangana, Congress

మేం పాలకులం కాదు.. సేవకులం: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో గవర్నర్‌ తమిళిసై.. రేవంత్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడలేదని, ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిందని అన్నారు. త్యాగాలే పునాదులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రగతి భవన్‌ ఇనుక కంచెలను బద్దలు కొట్టామని, రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా అందులోకి రావొచ్చని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

లంగాణ ప్రజలకు ఇవాళ స్వేచ్ఛ లభించిందన్న సీఎం.. ప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములుగా ఉంటారని అన్నారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని రేవంత్‌ అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. ''మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా.. మేం పాలకులం కాదు.. మీ సేవకులం'' అని సీఎం రేవంత్‌ అన్నారు. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుంటానని అన్నారు. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినీ ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు. ఆ నియామకపత్రాన్ని ఆమెకు అందించారు.

Next Story