తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..ఓపెనింగ్ ఎప్పుడంటే?

హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది.

By Knakam Karthik
Published on : 19 Jun 2025 7:44 AM IST

Hyderabad News, CM Revanthreddy, Gachibowli-Kondapur Flyover

తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..ఓపెనింగ్ ఎప్పుడంటే?

హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దివంగత నాయకుడు పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) ప్లైఓవర్‌గా దీనికి నామకరణం చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు ఆదేశించారు.

ఈ ఫ్లైఓవర్​ అందుబాటులో రానుండటంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. ఔటర్​ రింగు రోడ్డు నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఈ ఫ్లైఓవర్​ చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ఫ్లై ఓవర్ వల్ల ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు, అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు ఈ ఫ్లై ఓవర్ ద్వారా కలగనుంది.

Next Story