నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు

By Knakam Karthik
Published on : 21 Aug 2025 7:59 AM IST

Telangana, Cm Revanthreddy, Delhi Tour,

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రతిపక్ష 'ఇండియా' కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇండియా కూటమి ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Next Story