బ్లూ టిక్ కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి 'ఎక్స్‌' అకౌంట్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విట్టర్) లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారిక ఖాతా ‘బ్లూ టిక్’ గుర్తును కోల్పోయింది

By Medi Samrat  Published on  10 April 2024 8:00 PM IST
బ్లూ టిక్ కోల్పోయిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌ అకౌంట్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విట్టర్) లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారిక ఖాతా ‘బ్లూ టిక్’ గుర్తును కోల్పోయింది. దీంతో నెటిజన్లలో గందరగోళం నెలకొంది. ఖాతాకు సంబంధించిన ముఖ్యమంత్రి ప్రొఫైల్ పిక్చర్‌లో మార్పు కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. బ్లూ టిక్ రెండు రోజుల్లో పునరుద్ధరించనున్నారు. బుధవారం ముఖ్యమంత్రి ఖాతాకు ఉన్న బ్లూ టిక్ మార్క్ కనిపించకపోవడంతో చాలా మంది నెటిజన్లను కలవరపెట్టింది. వారిలో చాలా మంది ఆయన అకౌంట్ హ్యాక్ చేశారా అని అనుమానించారు.

ఖాతాకు సంబంధించిన ముఖ్యమంత్రి ప్రొఫైల్ పిక్చర్‌లో మార్పు కారణంగా బ్లూ టిక్ కోల్పోయిందని ఖాతాను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సోషల్ మీడియా బృందం వివరణ ఇచ్చింది. ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా ప్లాట్‌ఫారమ్‌పై ట్యాగ్ చేయడం, మెసేజ్ చేయడం కొనసాగించవచ్చని తెలియజేశారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటో స్థానంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకుని నడిచిన ఫోటోను పెట్టారు.

Next Story