న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులను పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దేశంలో ఒక 'ఏఐ వార్-రూమ్' ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
ఇందుకు హైదరాబాద్ సరైన వేదిక అని, కేంద్రం సహకరిస్తే ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ఏఐ యూనివర్సిటీని స్థాపించవచ్చని పేర్కొన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన ఆయన, బాధితులకు పునఃనైపుణ్యం (Re-skilling) కల్పించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
అలాగే భారత్ ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదగాలంటే జీపీయూ (GPU) చిప్ తయారీపై దృష్టి పెట్టాలని, ఏఐ స్టార్టప్‌లకు భారీగా నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఏఐ సమ్మిట్‌లను ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని ఆయన సూచించారు.