నేడు భద్రాచలంలో సీఎం రేవంత్ టూర్..రూ.351 కోట్లతో ఆలయ పనులకు శంకుస్థాపన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు.

By -  Knakam Karthik
Published on : 27 March 2026 6:48 AM IST

Telangana, CM RevanthReddy, Bhadrachalam, Bhadradri Temple, SitaramaKalyanam

నేడు భద్రాచలంలో సీఎం రేవంత్ టూర్..రూ.351 కోట్లతో ఆలయ పనులకు శంకుస్థాపన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.351 కోట్ల వ్యయంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ తొలిదశ పనులకు భూమి పూజ మరియు శంకుస్థాపన చేయనున్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీని తర్వాత మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను ఆయన సమర్పించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే భద్రాచలంలో భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది.

Next Story