హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులతో ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. అటు కృష్ణా జలాలపై కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
ఇక ఇటీవల వెలువడిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు..రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్దామని మంత్రుల అభిప్రాయాలను సీఎం తెలుసుకోనున్నారు. సొసైటీ పాలకమండలి ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. కార్పొరేషర్ ఛైర్మన్ల నియామకాలపైనా సమావేశంలో చర్చించనున్నారు. చివరగా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీలపై మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.