Telangana: 'బిల్డ్‌నౌ'.. భవన నిర్మాణాల అనుమతులు మరింత సులభం

గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

By అంజి
Published on : 21 March 2025 7:55 AM IST

CM Revanth Reddy, new building permit system, BuildNow, Telangana

Telangana: 'బిల్డ్‌నౌ'.. భవన నిర్మాణాల అనుమతులు మరింత సులభం

గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పారదర్శకమైన “తెలంగాణ మోడల్” పరిపాలన అందించడం తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల మంజూరులో పూర్తి ఆన్‌లైన్‌లో సత్వర సేవలను అందించే విధంగా మున్సిపల్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బిల్డ్‌నౌ పోర్టల్‌ను రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తర్వాత నగరంలో ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి ఈ సందర్భంగా అనుమతి పత్రాలను అందించడం ద్వారా బిల్డ్‌నౌ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పూర్తి పారదర్శకంగా సమాజంలో పెద్ద చిన్న అన్న తారతమ్యం లేకుండా అందరికీ సమాన, సత్వర సేవలు అందించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు ఆన్‌లైన్ ద్వారా అందించాలన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ తీసుకొచ్చినట్టు చెప్పారు.

“భవన నిర్మాణాల కోసం గతంలో మాన్యువల్‌గా జరిగినప్పుడు అనేక అవకతవకలకు, అక్రమాలకు ఆస్కారం ఉండింది. కొందరు పెద్దవాళ్లకు ఆన్‌లైన్ విధానం అమలు చేయడం వల్ల కొంత బాధ ఉండొచ్చు. ఏదైనా ఒక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు కచ్చితంగా కొందరికి ఇబ్బంది ఉంటది. ఇప్పుడు పేదోడు, పెద్దోడు అన్న తేడా లేదు. అందరూ పబ్లిక్ డొమైన్‌లో దరఖాస్తు చేసుకోవలసిందే. అనుమతుల కోసం బిల్డ్‌నౌలో అప్‌లోడ్ చేయాల్సింది. పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పోర్టల్ తీసుకొచ్చాం” అని వివరించారు.

Next Story