రూ.225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

తెలంగాణ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

By -  Knakam Karthik
Published on : 6 April 2026 3:33 PM IST

Telangana, Nirmal District, Basara, Goddess Saraswati, TempleDevelopment, CM RevanthReddy, BasaraMasterPlan

రూ.225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

తెలంగాణ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ , జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని పునరుద్ధరించి, తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రూ. 225 కోట్లతో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబ సమేతంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రాన్ని పర్యాటక పరంగా, ఆధ్యాత్మికంగా మరింత తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story