Telangana: బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్‌

గోదావరి నదిపై నిర్మల్‌ జిల్లాలో నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

By -  అంజి
Published on : 16 Jan 2026 4:04 PM IST

CM Revanth Reddy, Sadarmat Barrage, Nirmal district, Telangana

Telangana: బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్‌

గోదావరి నదిపై నిర్మల్‌ జిల్లాలో నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. మామడ మండలం పొన్కల్‌ గ్రామం పరిధిలో నిర్మించిన బ్యారేజీ గేట్లు ఓపెన్‌ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సదర్‌మాట్‌ బ్యారేజీ ద్వారా నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో 18,120 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాక - కొరాటా బ్యారేజ్ పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్‌ ప్రారంభించారు. లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసి హారతినిచ్చారు. లోయర్ పెనుగంగ ప్రధాన కాలువలోకి నీరు చేరడంతో ఆదిలాబాద్ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. చనాకా-కొరాటా బ్యారేజీని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందించడం.

Next Story