అందుకే ఆ మీటింగ్ ను బహిష్కరిస్తున్నా: రేవంత్ రెడ్డి

ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకావడం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

By అంజి  Published on  26 July 2024 5:00 PM IST
CM Revanth Reddy, Boycott, NITI Aayog meeting, Telangana

అందుకే ఆ మీటింగ్ ను బహిష్కరిస్తున్నా: రేవంత్ రెడ్డి 

కేంద్రం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ జూలై 27న ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకావడం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని శాసనసభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రధానమంత్రి నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉంటారు. నీతి ఆయోగ్ సమావేశం జులై 27న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. తెలంగాణ హక్కులను కాలరాస్తున్నందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులు విడుదల చేయనందుకు, తెలంగాణకు ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వనందుకు తెలంగాణ ముఖ్యమంత్రిగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన నిరసనలో భాగంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR), పాలమూరు-రంగా రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం లాంటి ఎన్నో ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా లేదన్నారు.

Next Story