శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ)లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణు దేవ్‌వర్మకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొమ్మిది మంది కొత్త గవర్నర్లను, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు.
త్రిపురకు చెందిన బీజేపీ సీనియర్ నేత జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. త్రిపుర రాజకుటుంబానికి చెందిన వర్మ గతంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. జిష్ణు దేవ్ వర్మ ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయనున్నారు.