ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదని.. ట్యాపింగ్‌పై నాకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు, ఇస్తే విచారణకు వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ట్యాపింగ్‌పై గవర్నమెంట్ కేసు పెట్టలేదని.. సామాగ్రి మిస్సింగ్ కేసు మాత్రమే ఉందని.. దాన్ని లోతుగా విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చాయి.. ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదుదారుడు అని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాలు చేసేవే అయితే కేటీఆర్ కమిషన్ ముందుకు వెళ్లి అదే చెప్పు.. ఆయన వాక్ స్వేచ్ఛ ను నేను హరించనన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పద్దతి ప్రకారం చెయ్యాలన్నారు. చట్టవిరుద్దం కాదు కాని దానికంటూ ఒక పద్ధతి ఉంటుందన్నారు. పెగాసెస్ వాడినారో లేదో కమిషన్ ఇచ్చే నివేదికను బట్టే తెలుస్తుందన్నారు. నెగెటివ్ అంశాలపై నేను పెద్దగా పట్టించుకోను అన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా చాటుగా వినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.. దీనికంటే ఆత్మహత్య చేసుకోవడం మేలు అన్నారు.