కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అయితే రెండు రోజుల క్రితం దామోదర్ రెడ్డి.. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు.. దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కుటుంబీకులు.. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఉంచారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ సహా పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.