కేంద్రరక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ..ఆ భూములు బదలాయించాలని విజ్ఞప్తి

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు

By -  Knakam Karthik
Published on : 10 Sept 2025 11:38 AM IST

Telangana, CM Revanthreddy, Delhi Tour,  Union Defense Minister Rajnath Singh

కేంద్రరక్షణ మంత్రితో సీఎం రేవంత్ భేటీ..ఆ భూములు బదలాయించాలని విజ్ఞప్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతోన్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు 98.20 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బ‌ద‌లాయించాల‌ని సీఎం కోరారు. మూసీ, ఈసీ న‌దుల సంగ‌మం స‌మీపంలో గాంధీ స‌ర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేప‌ట్టనున్నట్లు ఆయన రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. జాతీయ స‌మైక్యత‌, గాంధేయ విలువ‌ల‌కు సంకేతంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ నిలుస్తుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య ఉన్నారు.

Next Story