హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమను బలవంతంగా, దోపిడీతో టార్గెట్ చేస్తోందన్నారు. తన ఆదుపాజ్ఞల్లో ఉండనందుకు , డబ్బు ఇవ్వనందుకు తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ కక్షగట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ టాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుందన్నారు. తెలుగు స్టార్లు, నిర్మాతలపై ప్రతీకారం తీర్చుకుంటోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ సర్కార్ చెడ్డపేరును మూటగట్టుకుందని విమర్శించారు.
అల్లు అర్జున్ పుష్ప 2 ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల మహిళ మరణించిన తర్వాత ఇది జరిగింది. "రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఏదో సమస్య తలెత్తుతోంది. తెలుగు సూపర్ స్టార్లు, సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి ప్రయత్నాలను అంగీకరించడానికి నిరాకరించినందున వారిపై నియంత్రణ, డబ్బు సేకరించేందుకు భారతదేశంలోని అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన చలనచిత్ర పరిశ్రమలలో ఒకటైన టాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నట్లు కనిపిస్తోంది" అని అతను అన్నాడు.