రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు రమేష్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు వినియోగిస్తోందన్నారు. నిధుల మంజూరుపై ఆంధ్రప్రదేశ్ లోని సర్పంచ్ లను ఢిల్లీకి రప్పించి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.
పోలవరం ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం వల్ల భద్రాచలం ముంపునకు గురికాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించడం లేదని సీఎం రమేష్ ఆరోపించారు.